జ్ఞాన యోధుడు: సన్నాఫ్ జోగిని చిన్నూబాయి
—–రచన: డాక్టర్ కోయి కోటేశ్వరరావు జోగినికి పుట్టిన బిడ్డ అంటూ లోకం అతనిని అవమానించింది. తండ్రి ఎవరో తెలియని అనామకుడని సభ్య సమాజం తిరస్కరించింది. అంటరాని అభాగ్యుడని ఊరు ‘బాకున కుమ్మినట్లు’ బాధించింది. కుల భూతం విషం చిమ్మింది. పేదరికం వెక్కిరించింది. చుట్టుముట్టిన లెక్కలేని అవమానాలను ధిక్కరించి, కఠోర శ్రమతో అచంచల కార్యదీక్షతో ధీరోచితంగా అతను ముందడుగు వేశాడు. దారి కడ్డంగా పరుచుకున్న రాళ్ల గుట్టలను దాటుకుంటూ, ముళ్ళ తుప్పలను తొక్కుకుంటూ నెత్తుటి పాదాలతోనే నడక సాగించి…






