దళితురాలని తెలిసే చంపారు, తెనాలి ఘటనపై ఎస్.పి -కత్తిరింపు
తెనాలిలో తాగుబోతుల దుర్మార్గం ఫలితంగా లారీ కింద పడి చనిపోయిన సునీల కుటుంబం దళితులని తెలిసే వారిపై దుర్మార్గానికి పాల్పడ్డారని గుంటూరు ఎస్.పి జె.సత్యనారాయణ హై కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని ఈనాడు పత్రిక తెలిపింది. బి.టెక్ చదువున్న సునీల కుమార్తెను దుండగులు మొదట కులం పేరుతో దూషించి అనంతరం లైంగికంగా వేధించారని ఎస్.పి తన నివేదికలో పేర్కొన్నారు. ది హిందు రిపోర్టును పిటిషన్ గా సుమోటోగా విచారణకు స్వీకరించిన రాష్ట్ర హై కోర్టు స్వయంగా విచారణను…