బంగ్లాదేశ్ అక్రమ వలసలు సున్నిత సమస్య -సుష్మా

ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారంలో ఉంటే మరొక మాట. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓట్ల కోసం సవాలక్షా మాట్లాడితే అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడడం. అధికారం మోపే అనివార్య జాతీయ, అంతర్జాతీయ బాధ్యతల బరువు నిరంతరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గుర్తు చేస్తుంటే బలవంతాన నాలుక తీటను అణిచిపెట్టుకోవలసిన అగత్యం దాపురిస్తుంది. తోటి సచివులకి ఆదర్శ వంతులుగా వ్యవహరించాలని హిత బోధలు చేసేందుకు కూడా ప్రేరేపిస్తుంది. ఎన్నికల ముందు అక్రమ బంగ్లాదేశ్ వలస జనం వెనక్కి…