లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్

తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం…

లడ్డు: భక్తుల మనోభావాలతో ప్రభుత్వమే ఆడుకుంది -సుప్రీం కోర్టు

తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన వివాదం సుప్రీం కోర్టును చేరింది. తన ముందుకు వచ్చిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, ప్రాధమిక ఆధారాల ప్రకారం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రపంచ వ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రికి ఇది తగదు అని గడ్డి పెట్టింది. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు…