కరెంటు వైరూ, చిరుగు బేనరూ … కాదేదీ గీతకనర్హం

అగ్గి పుల్లా కుక్క పిల్లా సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం కవితామయమేనోయ్ అన్నీ…  అన్నారు మహాకవి శ్రీ శ్రీ శ్రీ శ్రీ అన్నది కవిత్వం గురించి. కవిత్వం అల్లడానికి అందమైన స్త్రీ మూర్తి మాత్రమే అర్హురాలని భావిస్తున్న రోజుల్లో, రచనా స్ఫూర్తి కోసం కావ్య ప్రబంధాలను బట్టీయం వేయాల్సిందేనని భావించే రోజుల్లో, మనో భావాలను అక్షరీకరించడానికి ఛందోబద్ధ సంకెళ్ళను విధించిన యుగంలో శ్రీ శ్రీ రాసిన ఈ కవిత ఒక పెద్ద సంచలనం! జన తత్వం వంటబట్టాలే…