క్లుప్తంగా… 03.05.2012
జాతీయం బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి…

