అధికారం కోసం కుమ్ములాటలో ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమాధి

ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో…

మరోసారి నిరవధిక ఆందోళనలో ఈజిప్టు ప్రజానీకం, ముబారక్ అవశేషాల కోనసాగింపుపై ఆగ్రహం

18 రోజుల నిరవధిక దీక్షతో 30 సంవత్సరాల నియంతృత్వ పాలనను కూలదోసి, నియంత ముబారక్‌ను జైలుపాలు చేసిన ఈజిప్టు ప్రజానీకం మరొకసారి పోరాటబాట చేపట్టారు. ఈజిప్టు విప్లవం చేసిన డిమాండ్లను నెరవేర్చడంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, డిమాండ్లు నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదనీ ఈజిప్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈజిప్టు విప్లవం ప్రారంభ కాలంలో నిరసనకారులను కాల్చి చంపడానికి కారణమైన సైనికాధికారులనూ, పోలీసులనూ విచారించడం లేదనీ, వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారనీ పైగా నిరసన కారులపై…