పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

మానవ సమాజాన్ని శాసిస్తున్నది ఒక విధంగా యుద్ధాలే. శ్రామిక, దోపిడీ వర్గాల వైరుధ్యాలే మానవ సమాజ అభివృద్ధితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. వైరుధ్యం అనే నాణేనికి ఒక వైపు అభివృద్ధి ఉంటే మరో వైపు విధ్వంసం ఉంటోంది. వైరుధ్యం వివిధ రూపాల్లోకి (బానిస, యజమానుల వైరుధ్యం; రైతు, భూస్వాముల వైరుధ్యం; కార్మికుడు, పెట్టుబడిదారుల వైరుధ్యం, మనిషి, ప్రకృతి వైరుధ్యం) మారేకొద్దీ అభివృద్ధీ, విధ్వంసం కూడా తమ రూపాల్ని మార్చుకుంటూ వస్తున్నాయి. విధ్వంసం అంటే యుద్ధమే అని…