సల్లీ డీల్స్ కేసులో మొదటి అరెస్టు

బాధితులు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ కేసులో మొదటి అరెస్టు జరిగింది. ఈ అరెస్టును ఆదివారం ఢిల్లీ పోలీసులు చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం నుండి ‘ఓంకారేశ్వర్ ఠాకూర్’ ని అరెస్ట్ చేశామనీ, అతనే సల్లీ డీల్స్ ఆప్ సృష్టికర్త అనీ ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ముంబై పోలీసులు ‘బుల్లీ బాయ్’ కేసులో వరుసగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. జులై…

బుల్లి బాయ్: ఢిల్లీ పోలీసుల చేతుల్లో ప్రధాన కుట్రదారు

బుల్లి బాయ్ ఆప్ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారు ఎవరో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అస్సాంలో అతని జాడ కనుగొన్నామని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసు బృందం అస్సాం వెల్లిందని ఈ రోజు సాయంత్రం 3 లేదా 4 గంటల సమయానికి నిందితుడిని ఢిల్లీకి తెస్తారని ఢిల్లీ సైబర్ సెల్ డి‌సి‌పి కే‌పి‌ఎస్ మల్హోత్రా చెప్పారు (ఇండియన్ ఎక్స్^ప్రెస్, 06/01/2022). “ప్రధాన కుట్రదారుని మేము అరెస్ట్ చేశాము. అతనే వెబ్ సైట్ తయారీలో ప్రధాన ముద్దాయి.…

పనస పండు దొంగ కోసం పోలీసుల ఉరుకులు

‘రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అని సామెత. మన ఎం.పిలు, ఎమ్మేల్యేలు ఆధునిక రాజులు కదా, వారు తలచుకున్నా అదే పరిస్ధితి సంభవించగలదు. లేకపోతే ఎం.పి గారి ఇంటి ఆవరణలోని పనస చెట్టు నుండి పనస పండ్లను దొంగిలించిన దొంగ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఆధునిక అపరాధ పరిశోధన పద్ధతులన్నీ ప్రయోగించడం… ఎలా అర్ధం చేసుకోవాలి? ఎఎపి ప్రభుత్వం విదేశీ వ్యభిచార గృహాలపై దాడులు చేయమన్నా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరిగిన…

ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి

ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వ పాలనలో మరో రెండు అసాధారణ అంశాలు నమోదయ్యాయి. నిజానికి అసాధారణం కాదు. మన ప్రభుత్వాల విధానాల ప్రజా వ్యతిరేక స్వభావంలోని సాధారణత్వం వలన ఎఎపి తీసుకుంటున్న సాధారణ చర్యలు కూడా అసాధారణంగా కనిపిస్తున్నాయి. వాహనదారుల పర్సు లాక్కొని డబ్బు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిన పరిస్ధితికి కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టడం ఒక అంశం. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న లక్షకు పైగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విధాన నిర్ణయం తీసుకోవడం…