ఇండియా టెర్రరిస్టులే ఢిల్లీ పేలుళ్ళ బాధ్యులు కావచ్చు -హోం మంత్రి
ఇండియాలో ఉన్న టెర్రరిస్టులే ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లకు బాధ్యులు కావచ్చని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నాడు. ” భారతదేశంలో జరిగే టెర్రరిస్టు దాడులకు ఇప్పుడు కేవలం సరిహద్దుల అవతలినుండే జరుగుతున్నాయని ఆరోపించలేము” అని ఆయన అన్నాడు. వార్తా ఛానెళ్ళకు అందిన ఈ మెయిళ్ళ సమాచారాన్ని నిపుణులు ఇంకా విశ్లేషిస్తున్నారని ఆయన తెలిపాడు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్ళలో చనిపోయినవారి సంఖ్య 13కి చేరుకుందని కూడా ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ నుండి నడిచే హర్కత్ ఉల్ జిహాదీ…