అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

నిర్భయానికి మరణం లేదు -కవిత

ఢిల్లీ బస్సులో దారుణానికి గురై మరణించిన అమ్మాయిని పత్రికలు, ప్రజలు, ఆందోళనకారులు అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆరు మృగాలతో నిర్భయంగా పోరాడింది కనుక ‘నిర్భయ’ అనీ కొందరు, ఒకనాటి వాస్తవ ఘటనకు గుర్తుకు తెచ్చుకుంటూ ‘దామిని’ అని కొందరు పిలుస్తున్నారు. ఎన్.డి.టి.వి చానెల్ బాధితురాలిని ‘అమానత్’ అని సంబోధించింది. ఆకాశంలో సగం ధిక్కరించిన పిడికిళ్ళైనంతకాలం తాను ఏ పేరుతోనైనా నిలిచే ఉంటుందని మరో కవి చిట్టిపాటి.వెంకటేశ్వర్లు తన కవితలో ఇలా స్పందిస్తున్నారు. బొమ్మపై క్లిక్ చేసి…

మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు

యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె. “ఆమెను బతికించడానికి…

బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…

అమ్మాయిలు డేటింగ్ చేస్తే అత్యాచారానికి అర్హులవుతారా?

(ఈ టపా దీనికి ముందరి టపా కింద మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాఠకులు గ్రహించగలరు) – స్త్రీవాదిననీ, మార్క్సిస్టుననీ చెప్పే మిత్రుడు చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పైగా తన అభిప్రాయాలతో ఏకీభవిస్తేనే స్త్రీవాది మరియు మార్క్సిస్టు అవుతారన్నట్లుగా చెప్పడం ఇంకా అభ్యంతరకరంగా ఉంది. మిత్రుడు చెప్పిందాన్నిబట్టి చూస్తే, ఆయన దృష్టిలో డేటింగ్ అంటే శారీరక సంభోగమే తప్ప మరొకటి కాదు. స్త్రీలు డేటింగ్ చేయడం తనకి నచ్చదు. ఒక…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…

బాధితురాలి తెగువ, ధైర్యం అపూర్వం -డాక్టర్లు

“ఆమె గొప్ప ధైర్యవంతురాలు. తనపై దాడి జరిగిన మొదటి క్షణం నుండి ఈ రోజువరకూ పోరాడుతూనే ఉంది” ఈ మాటలన్నది సఫ్దర్ జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.డి.అధాని. బాధితురాలిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్టర్ల ప్రకారం లైంగిక అత్యాచారం జరిగిన కేసుల్లో ఇంత తీవ్రమైన, లోతైన, బాధాకరమైన గాయాలను మరే కేసులోనూ వారు చూడలేదు. పెద్ద పేగు మొత్తాన్ని సర్జరీ ద్వారా తొలగించినట్లు కొన్ని పత్రికలు చెబుతుండగా గాంగ్రీన్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగించినట్లు…

ఢిల్లీ వీధుల్లో మగమృగాలు, మరణశయ్యపై గ్యాంగ్ రేప్ బాధితురాలు

దేశ చరిత్రను ఆడపిల్లల కన్నీళ్లతో రాయవలసిన దుర్దినాలు వర్ధిల్లుతున్నాయి. ఒక్కో మానభంగం ఒక్కో కొత్త అధ్యాయానికి అర్హత పొందుతూ పశుత్వ ప్రదర్శనలో కొత్త రికార్దులు సృష్టిస్తున్నాయి. దేశరాజధానే అందుకు నిరంతరవేదికగా మారిపోయింది. 23 సంవత్సరాల పారమెడికల్ విద్యార్ధిని ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన దారుణం సభ్యసమాజం శాశ్వత వంధత్వం కోరుకునేదిగా ఉంది. మగ మృగాల పశుత్వాన్ని ప్రతిఘటించినందుకు పొత్తికడుపులో పిడి గుద్దులు ఎదుర్కొని పేగులు చితికిపోయి చావుబతుకుల మధ్య ఒక ఆడపిల్ల కొట్టుమిట్టాడుతోంది. ఆమెను…