సి.ఐ.ఏపై కేసుకు పాక్ కోర్టు ఆదేశం

పాకిస్తాన్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పాక్ లో పని చేసి వెళ్ళిన సి.ఐ.ఏ మాజీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడుల ద్వారా హత్య, కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించడం తదితర నేరాలకు పాల్పడినందుకు గాను వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికన్ డ్రోన్ దాడుల్లో తన కొడుకును కోల్పోయిన ఉత్తర వజీరిస్తాన్ పౌరుడొకరు చేసిన…

డ్రోన్ హత్యలు చట్టబద్ధమే -అమెరికా

డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్…

అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా…

అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు

పాకిస్ధాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైన్యం సాగిస్తున్న డ్రోన్ హత్యలు చట్ట విరుద్ధం అని ఒక పాకిస్ధాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం, ఐరాస జోక్యం కోరాలని కూడా కోర్టు పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించినట్లయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకునే అవకాశాలు పరిశీలించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. డ్రోన్ దాడులను అంగీకరిస్తూ పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం…

అమెరికా డ్రోన్ దాడుల్లో 2,800 పాక్ పౌరుల మరణం

గత యేడేళ్ళలో అమెరికా మానవ రహిత విమానాలు మూడువేల మంది అమాయక పాకిస్ధాన్ పౌరులను చంపేశాయని మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపాడు. మొత్తం దాదాపు మూడువేల మంది అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోగా వారిలో 2,800 మంది అమాయక పౌరులేనని పాకిస్ధాన్ మానవ హక్కుల కార్యకర్త షాజాద్ అక్బర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. 170 మంది మాత్రమే అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న “మిలిటెంట్లు” అని ఆయన తెలిపాడు. “ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్”…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -1

ప్రజాస్వామిక సంస్కరణల కోసం అరబ్ దేశాల్లో ప్రజానీకం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యమిస్తున్న నేపధ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యానికి తీవ్రం ఆటంకాలు తలెత్తాయి. ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలలో గట్టి మద్దతుదారులుగా ఉన్న ట్యునీషియా, ఈజిప్టు లలో నియంతృత్వ ప్రభుత్వాలు కూలిపోయాయి. కుట్రలు పన్ని ఆ రెండు దేశాలలో ప్రజా ఉద్యమాలు చివరివరకు కొనసాగకుండా అమెరికా చూసుకోగలిగింది. తమ పాత అనుచరులను, నమ్మకస్తులనే ఆ దేశాల్లో పాలకులుగా కొనసాగించగలుగుతోంది. అరబ్ ప్రజా ఉద్యమాలకు…