ప్రపంచ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ –విశ్లేషణ 1

సోమవారం ప్రపంచం లోని వివిధ ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ మొత్తంలో నష్టపోయాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ భారీ పతనాన్ని బ్లడ్ బాత్ గా అభివర్ణిస్తున్నాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీ అయిన డౌ జోన్స్, 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కాలంలో కూడా ఎరగని విధంగా ఒకే రోజు 1175 పాయింట్లు నష్టపోయింది. కాబట్టి బ్లడ్ బాత్ అనడం కరెక్ట్ అనిపించక మానదు. అంకెల్లో చూసినప్పుడు ఇంత భారీ పతనాన్ని డౌ…