బడ్జెట్: జైట్లీ చదవని భారీ సంస్కరణలు
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన నోటితో చదవని భారీ సంస్కరణలు బడ్జెట్ లో దండిగానే ఉన్నాయి. ఆంగ్లంలో బిగ్ టికెట్ రిఫార్మ్స్ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పిలిచే ఈ సంస్కరణలే బడ్జెట్ అసలు సారాంశం. జనం మెచ్చే కేటాయింపులు సభలో చదివి తక్షణం ప్రతిపక్షాలు, ప్రజల నుండి విమర్శలు ఎదురయ్యే ప్రతిపాదనలను చదవకుండా ఆర్ధికమంత్రి జాగ్రత్తపడ్డారు. తద్వారా పేదలది ఎంతమాత్రం కాని బడ్జెట్ ని “ఇది పేదల బడ్జెట్” అని ప్రధాని నిరభ్యంతరంగా ప్రకటించే…
