పోలీసుల సాయంతో తివారీకి రక్తపరీక్షలు చేయండి -ఢిల్లీ కోర్టు

పోలీసుల సహాయం తీసుకుని తివారీ కి రక్త పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ కోర్టు తమ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, యు.పి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఎన్.డి.తివారీ తనకు తండ్రి అంటూ రోహిత్ శేఖర్ అనే 32 యేళ్ళ యువకుడు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. డి.ఎన్.ఏ పరీక్షల ద్వారా రోహిత్ ఆరోపణలను నిర్ధారించడానికి కోర్టు ప్రయత్నిస్తున్నప్పటికీ రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చాడు.…

కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం

గుర్తు తెలియని సమాధుల్లో పాతి పెట్టిన 2,156 శవాలను గుర్తించాలని జమ్మూ కాశ్మీరు “రాష్ట్ర మానవ హక్కుల సంఘం” సిఫారసు చేసింది. మానవ హక్కుల సంఘానికి చెందిన పోలీసు విభాగం ఈ సమాధులను గత నెలలో గుర్తించడం సంచలనం కలిగించింది. కాశ్మీరులో భారత భద్రతా బలగాలు దేశ రక్షణ పేరుతోనో, తీవ్రవాదం పేరుతోనో కాశ్మీరు యువకులను అనేక వేలమందిని మాయం చేశాయని చాలా కాలం నుండి కాశ్మీరు ప్రజలు ఆరోపిస్తున్నారు. 2001 జనాభా లెక్కల సేకరణ అనంతరం…