చైనా కరెన్సీ యుద్ధం – డాలర్ కు తూట్లు –ఈనాడు ఆర్టికల్

ఈ రోజు (నవంబర్ 16, 2013) ఈనాడు పత్రికలో వచ్చిన ఆర్టికల్ ఇది. ప్రపంచ దేశాల అనధికార రిజర్వ్ కరెన్సీగా ఆధిపత్యంలో ఉన్న డాలర్ కు చైనా క్రమంగా, స్ధిరంగా ఎలా తూట్లు పొడుస్తున్నదీ వివరించే వ్యాసం. ఏక ధృవ ప్రపంచంలో ఏకైక ధృవంగా అమెరికా ఇన్నాళ్లూ పెత్తనం చెలాయించింది. గత నాలుగేళ్లుగా అమెరికా ఆర్ధిక శక్తి బాగా క్షీణించడంతో ఆర్ధికంగా బహుళ ధృవ ప్రపంచం ఆవిర్భవించింది. రాజకీయంగా కూడా అమెరికా ప్రభావం క్షీణిస్తోంది. డాలర్ పతనం…

తగలబడుతున్న కాగితం డబ్బు, రెక్కలిప్పిన బంగారం ధర -కార్టూన్

అమెరికా రుణ సంక్షోభం పుణ్యమాని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు మళ్ళీ కనపడుతున్నాయి. సోమవారం కుప్ప కూలిన షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. జారడం మొదలవ్వాలేగానీ ఎక్కడ ఆగుతామో తెలియదన్నట్లుగా ఉంది షేర్ మార్కెట్ల పరిస్ధితి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా లలోని ప్రధాన షేర్ సూచీలన్నీ పతన దిశలో సాగుతూ ఇన్‌వెస్టర్లను, వ్యాపారులనూ, ప్రభుత్వాధికారులను, మార్కెట్ నియంత్రణా సంస్ధలనూ, ప్రభుత్వాలనూ వణికిస్తూ కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అమెరికా రుణ సంక్షోభం…