ఇండియన్లూ, ధ్యాంక్స్! -ఒబామా (వ్యంగ్యం)
రూపాయి విలువ దయనీయమైన పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. రూపాయి విలువ తగ్గడం అంటే మన కొనుగోలు శక్తి తగ్గిపోవడం. అనగా మనం సంపాదించే ఆ నాలుగు రూకలకు ఇంకా ఇంకా తక్కువ సరుకులు రావడం. బెత్తెడు వేతనాల మధ్యతరగతి జీవులకు మరిన్ని కష్టాలు, మరిన్ని మానసిక (సామాజిక) వేదనలు, మరిన్ని అప్పులు, మరిన్ని…. కూలి జనం పరిస్ధితి ఇంకా ఘోరం. తాగుబోతు భర్తలు, తాగుబోతు తండ్రులను కలిగి ఉన్నవారి పరిస్ధితి చెప్పనే అవసరం లేదు. రూపాయి విలువను కాపాడడానికి…