నల్లజాతి యువకుడి హత్య తీర్పు, అట్టుడుకుతున్న అమెరికా
అమెరికాలో జాతి విద్వేషం మళ్ళీ ప్రముఖంగా చర్చకు వచ్చింది. గత సంవత్సరం తెల్లజాతి పోలీసు చేతిలో హత్యకు గురయిన ట్రేవాన్ మార్టిన్ కేసులో నిందితుడు నిర్దోషి అని శనివారం కోర్టు తీర్పు చెప్పడంతో అమెరికా వ్యాపితంగా నిరసనలు చెలరేగాయి. అనేక చోట్ల నిరసనకారులు విధ్వంసాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. జాతి బేధం లేకుండా అన్ని జాతుల వారు నిరసనల్లో పాల్గొంటున్నారు. ట్రేవాన్ మార్టిన్ నల్లజాతికి చెందినవాడు కనకనే పోలీసు సహాయకుడు జిమ్మర్ మేన్ అతని నుండి ఎటువంటి ప్రమాదం…


