ఎవరి గౌరవమీ ట్రయల్ రూముల రహస్య కెమెరాలు?
సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి గారే విపత్కర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. లేదా ఎదుర్కొన్నానని మంత్రి గారు లోకానికి చాటారు. అదేమీ లేదని ఫాబ్ ఇండియా వారు వివరణ ఇచ్చుకున్నప్పటికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణ విస్తృత వ్యాప్తిలో ఉన్న ఒక అసహ్యకరమైన వ్యాధిని వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యాధి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ అదేమీ ఎరగనట్లు నటించడమే వ్యాధి విస్తరణకు ప్రధాన పోషకురాలు. ఈ రీత్యా స్మృతి ఇరానీ చిన్నపాటి సాహసం చేశారని చెప్పవచ్చు.…
