అమెరికాలో మళ్ళీ టోర్నడోల భీభత్సం -ఫోటోలు

అమెరికాలో టోర్నడో (గాలివాన) ల సీజన్ మొదలయింది. శనివారం చెలరేగిన టోర్నడోల ధాటికి వేలాది ఇళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. రెండు డజన్లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించిన గాలివాన, మొత్తం 6 రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఒక్క ఆదివారమే 30కి పైగా టోర్నడోలు భీభత్సం సృష్టించగా వచ్చే రోజుల్లో మరో 100 టోర్నడోలు అమెరికాను తాకవచ్చని అమెరికా వాతావరణ విభాగం హెచ్చరించింది. అమెరికాలో టోర్నడోగా పిలిచే గాలివాన ఇక్కడ మనం…

సుడిగాలి పవర్ అమెరికాలోనే చూడాలి -ఫోటోలు

సుడిగాలి గురించి వినడమే గాని మనకి పెద్దగా తెలియదు. ఎందుకంటే అది మన వాతావరణం లక్షణం కాదు. అమెరికా సుడిగాలి విధ్వంసాలకు పెట్టింది పేరు. అక్కడ సుడిగాలిని టోర్నడో అనీ ట్విస్టర్ అనీ పిలుస్తారు. ఆకాశం నుండి నేలకు నిచ్చెన వేసినట్లు కనిపించే సుడిగాలి అందుబాటులోకి వచ్చే ప్రతి వస్తువును లోపలికి లాక్కుంటూ క్షణాల్లో పెను ఉత్పాతాలను సృష్టించి పోతుంది. పెద్ద పెద్ద కార్లు, బస్సులతో సహా వందల మీటర్ల మేర విసిరికొట్టేస్తుంది. తరచుగా చెట్లను సమూలంగా…