ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని గాల్లోనే అడ్డుకున్న ఇరాన్

రక్షణ రంగ కొనుగోళ్ళ విషయం గురించి చర్చించడానికి ఇండియా వస్తున్న జర్మనీ ఛాన్సలర్ విమానాన్ని ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రెండు గంటలపాటు సదరు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరికి టర్కీ మద్యవర్తిత్వంతో మెత్తబడిన ఇరాన్ జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రయాణిస్తున్న విమానానికి అనుమతి ఇవ్వడంతో ఆమె క్షేమంగా ఇండియా చేరగలిగింది. విమానాన్ని తమ గగన తలం లోకి ఇరాన్ ఎందుకు అనుమతించనిదీ కారణం ఇంకా తెలియలేదు. ఇరాన్…

ఇండియాకు టైఫూన్, రాఫేల్ లలో ఏ ఫైటర్ జెట్ విమానం మంచిది?

ఇండియా చాలా కాలంగా ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను కొనడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా, ఫ్రాన్సు, స్వీడన్ లతో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల ఉమ్మడి కంపెనీ లు తమ ఫైటర్ జెట్ లే కొనమని పోటీ పడుతూ వచ్చాయి. గురువారం భారత ప్రభుత్వ మిలట్రీ అమెరికా, స్వీడన్ లను తన జాబితానుండు తొలగించింది. ఇప్పుడు రెండు ఫైటర్ జెట్లు పోటీ పడుతున్నాయి. ఒకటి నాలుగుదేశాల ఉమ్మడి కంపెనీ యూరో ఫైటర్ తయారు చేసే “టైఫూన్”…