కోర్టులో మన్మోహన్, చిదంబరం పేర్లను ప్రస్తావించిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా
ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్‌నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు.…