హర్యానాలో టెర్రర్ కుట్ర విఫలం
హార్యానా రాష్ట్రం, అంబాలాలో పార్క్ చేసి ఉన్న కారు నుండి పోలీసులు డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్ధాలు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలలో భాగంగా ఇది వెల్లడి కాకపోవడం గమనార్హం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పందించారని పోలీసులు తెలిపారు. దీనితో మరోసారి టెర్రరిస్టు పేలుళ్ళు జరగకుండా తప్పించుకున్నట్లైంది. సమాచారం అందుకున్నాక ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇరువురూ ఉమ్మడిగా పార్కింగ్ చేసి ఉన్న బ్లూ ఇండికా కారును తనిఖీ చేశారు. “ఐదు డిటోనేటర్లు, రెండు టైమర్…