కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?
కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…
