టెర్రరిస్టు తాలిబాన్‌తో అమెరికా చర్చలు!!!
“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” (Global war on terrorism) ప్రకటించింది అమెరికా దేశమే. టెర్రరిజం వలన అమెరికా జాతీయ భద్రతకూ, అమెరికా ప్రజలకు ప్రమాదం ఏర్పడిందని, దరిమిలా టెర్రరిజం ప్రపంచం మొత్తానికీ ప్రమాదకరమనీ అమెరికా ప్రభుత్వం. ప్రపంచ దేశాలన్నీ తనతో కలిసి టెర్రరిజంపై పోరాటం చేయవలసిందేనని పరోక్షంగా శాసించింది. నీవెటువైపు? అని ప్రశ్నిస్తూ, నాతో లేకుంటే టెర్రరిజం వైపు ఉన్నట్లే అని హుంకరించింది అమెరికా అధ్యక్షుడే. అమెరికా హుంకరింపులతో ఇండియా లాంటి దేశాలు కూడా “నేను సైతం”…