టీనేజి కుర్రాడిని కాల్చి చంపిన పాకిస్ధాన్ రేంజర్లు జైలుపాలు
దొంగతనం చేయబోతున్నాడన్న అనుమానంతో ఓ టీనేజి కుర్రాడిని పబ్లిక్ పార్కులో దగ్గరినుండి కాల్చి చంపిన పారామిలిటరీ రేంజర్లు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. గత వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోనుటీ.వి ఛానెళ్ళు ప్రసారం చేయడంతో పాకిస్ధాన్ అంతటా నిరసన పెల్లుబుకింది. దొంగతన చేయడానికి వచ్చాడంటు సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి టీనేజీ కుర్రాడిని జుట్టుపట్టి లాక్కొచ్చి పారామిలటరీ దళాలైన “పాకిస్ధాన్ రేంజర్లు” అతి సమీపం నుండి రెండు సార్లు తూటాలు పేల్చి…