ఫెయిలయినందుకు టీచర్లందరినీ నిర్భంధించిన XI క్లాస్ విద్యార్ధులు
పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. తమని క్లాస్ XII కు ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు. దాదాపు తొంభై మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఉండడంతో జోక్యం చేసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. స్కూల్ సెక్రటరీ కూడా నిర్బంధించబడివనారిలో ఉండడం విశేషం. గోపీబల్లభ్ పూర్ లోని ‘నయబాసన్ జనకళ్యాణ్ విద్యాపీఠ్’ అనే పాఠశాలలో గురువారం…
