చైనా అధ్యక్షుడి రాకను నిరసిస్తూ ఢిల్లీలో టిబెటన్ ఆత్మాహుతి -ఫొటోలు

చైనా అధ్యక్షుడు హు జీంటావో భారత దేశం సందర్శించడాన్ని నిరసిస్తూ టిబెట్ జాతీయుడొకరు న్యూఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. తనకు తాను నిప్పంటించుకున్న జాన్ఫెల్ యేషి హు సందర్శనను వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ యాభై మీటర్లు పరిగెత్తాడు. దానితో వెంటనే మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. శరీరం ఎంతవరకు కాలిందీ వివరాలు తెలియలేదని పత్రికలు చెప్పాయి. టిబెట్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ…