వివాదాస్పద టాట్రా (మిలట్రీ) ట్రక్కులు ఖజానాకు బహు భారం
ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ సంచల రీతిలో చేసిన అవినీతి ఆరోపణలతో టాట్రా ట్రక్కులు వార్తలకెక్కాయి. ఈ ట్రక్కులను గత ముప్ఫై యేళ్ళుగా భారత ఆర్మీ కొనుగోలు చేసున్నదని ఆర్మీ చీఫ్ ‘ది హిందూ’ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటి వరకు 7,000 కు పైగా టాట్రా ట్రక్కులను ఆర్మీ కోనుగోలు చేసిందని ఆయన తెలిపాడు. వీటిని ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్ధితి ఆర్మీకి ఏర్పడిందని చెప్పాడు. అంతకంటే సామర్ధ్యం కలిగిన ట్రక్కులు…
