విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ…