వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం
వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని…

