‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె!’, ఆఫ్రికాలో ఇండియా ఔదార్యం
“ఓ వైపు ఇండియాలో ఆకలితో ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోతుండగా, మరో వైపు భారత్ శక్తివంతమైన దేశంగా ఎలా చెలామణి అవుతోంది? రెండు ఇండియాలు ఎలా సాధ్యం?” అంటూ భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తలంటు పోసి రెండు నెలలు కూడా కాలేదు. “గోదాములు లేక ఆరుబైట పరదాల క్రింద ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసి పాడుపెట్టే బదులు ఆకలితో ఉన్నవారికి ఉచితంగా పంచండి” అని సుప్రీం కోర్టు సలహా ఇస్తే “ఉచితంగా ఇవ్వడం సాధ్యం…