టాంక్ బండ్ విగ్రహాల ధ్వంసంపై సో-కాల్డ్ మేధావుల (అ)ధర్మాగ్రహం

మిలియన్ మార్చ్ సందర్భంగా తెలుగుజాతి మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావడం నిస్సందేహంగా ఖండనార్హమే. కానీ ఏనాడూ ప్రజల ఈతి బాధల గురించి కించిత్ ఆందోళన సైతం ప్రకటించనివారు, వేలకొద్దీ జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఎన్నడూ స్పందించనివారు, సోంపల్లి, కాకరాపల్లి ప్రజల కూడు, గూడు నాశనం చేయడమేకాక అదేమని అడిగినందుకు కాల్చి చంపడం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్యాదకు కూడా ప్రశ్నించని వారు ఈ నాడు మేధావులమంటూ విగ్రహాల ధ్వంసంపై ధర్మాగ్రహం ప్రకటించడం ఏ కోవలోకి వస్తుందో…

విగ్రహాలు కూల్చింది మేం కాదు -ఐ.ఎఫ్.టి.యు

గురువారం “మిలియన్ మార్చ్” సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చివేశారని డిజిపి ప్రకటించడం సరికాదని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఓ విలేఖరితో మాట్లాడుతూ ఖండించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా డిజిపి ప్రకటన జారీ చేయడం తగదని ఐ.ఎఫ్.టి.యు జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ హైద్రాబాద్ లో ఈటివితో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. టాంక్ బండ్ ప్రదర్శనలో అన్ని పార్టీలు, సంఘాల వారు పాల్గొన్నారనీ, పైగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు ప్రతిజ్గ్న చేసిన వెంటనే తిరిగి వచ్చారు తప్ప…