టర్కీ దేశస్ధుల హత్య – ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళనున్న టర్కీ
గాజా ప్రజలకోసం అంతర్జాతీయ సహాయం తీసుకెళ్తున్న ఓడలపైన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడి చేసి తొమ్మింది మంది టర్కీ దేశస్ధులను చంపివేశాక టర్కీ ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. పాలస్తీనీయులకు చెందిన గాజా ప్రాంతాన్ని సైన్యంతో చుట్టుముట్టి ఎటువంటి సరుకులూ అందకుండా కాపలా కాస్తుండడంపై ‘అంతర్జాతీయ న్యాయ స్ధానం’ ను ఆశ్రయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సహాయాన్ని పట్టుకెళ్తున్న ఓడల వరుసపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) బలగాలు, అంతర్జాతీయ జలాల్లో ఉండగానే…