కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు
ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం…