అసరం అత్యాచారం: ప్రాధమిక సాక్ష్యాలున్నాయ్ -పోలీసులు
తన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిపై అసరం బాపు అత్యాచారానికి పాల్పడ్డాడనేందుకు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. జోధ్ పూర్ డి.సి.పి అజయ్ లాంబ ప్రకారం 16 యేళ్ళ బాలిక ఫిర్యాదుపై పోలీసులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అసరంపై బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని వారి ప్రాధమిక విచారణలో తేలిందని

