ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ
ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…