బ్రెజిల్ నుండి ఐ‌ఎం‌ఎఫ్ గెంటివేత!

ఐ‌ఎం‌ఎఫ్ ని బ్రెజిల్ గెంటివేసింది. మీ సేవలు చాలు, దేశాన్ని విడిచి వెళ్ళండి అని మొఖం మీదే చెప్పింది. బ్రెజిల్ ఆర్ధిక మంత్రి స్వయంగా ‘ఇక చాలు, మూటా ముల్లె సర్దుకోండి’ అని చెప్పేశాడు. దానితో బ్రెజిల్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తామని బ్రెజిల్ ప్రకటించింది. ఐ‌ఎం‌ఎఫ్ సంస్ధ ప్రపంచ కాబూలీవాలా. ఆర్ధిక కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పుకుంటుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సంక్షోభ నివారణ ఔషధాలు అందజేసి కోమా ఉన్న ఆర్ధిక వ్యవస్ధలను…