2జి కుంభకోణం: సున్నం కొట్టుడు విజయవంతం! -కార్టూన్

2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో…