‘ఓటుకి నోటు’ కుంభకోణం, రాజకియ దళారీ ‘అమర్ సింగ్’ కస్టడీకి
కేంద్ర స్ధాయిలో చాన్నాళ్ళుగా రాజకీయ దళారిగా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చిన అమర్ సింగ్ కటకటాల పాలయ్యాడు. ‘ఓటుకి నోటు’ కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్, మొదట ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు హాజరునుండి మినహయింపు కోరుతూ పిటిషన్ వేసినప్పటికీ, చివరి నిమిషంలో కోర్టుకి హజరు కావడానికే నిశ్చయించుకున్నాడు. ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స జరిగినందున, కిడ్నీ ఇన్‌ఫెక్షన్ సోకిందనీ, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలున్నాయనీ కనుక…