ఆ గ్రామాలకు సూర్యరశ్మి ఇచ్చేది అద్దాలే -ఫోటోలు
నార్వే, ఇటలీ లలో ఉన్న రెండు గ్రామాలకు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. మిగిలిన ఆరు నెలలూ వారు చీకటిలో మగ్గాల్సిందే. ఆ రెండు గ్రామాలూ లోతైన లోయల్లో ఎత్తైన కొండలతో చుట్టుముట్టబడి ఉండడమే దానికి కారణం. వణికించే చలికి తోడు సూర్యరశ్మి లేకపోవడం ఆ గ్రామాలకు శాపంగా మారింది. ఈ సమస్యకు వారు ఓ వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. కొండలపై పెద్ద పెద్ద ఉక్కు అద్దాలు అమర్చి సూర్య రశ్మిని గ్రామాలపైకి పరావర్తనం…
