వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ ను స్వీడన్ కు అప్పగించడానికి బ్రిటన్ కోర్టు ఆమోదం

  వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కు ప్రపంచ వ్యాపింతంగా ఉన్న అభిమానులకు నిరాశ కలిగిస్తూ బ్రిటన్ కోర్టు అతనిని స్వీడన్ పోలీసులకు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. స్వీడన్ లో తనకు నిష్పక్షపాత న్యాయం దొరకదని జులియన్ వాదించినప్పటికీ కోర్టు అంగీకరించ లేదు. అయితే కోర్టు రూలింగ్ పై అప్పీలుకు వెళ్ళటానికి జులియన్ నిర్ణయించుకున్నట్లుగా అతని లాయర్లు తెలిపారు. స్విడన్ లో రేప్ చట్టాలు స్త్రీలకు మనోభావాలకు అనుగుణంగా సున్నితంగా ఉంటాయన్న పేరుంది. సహచరి అయినప్పటికీ…

జులియన్ అస్సాంజ్ అప్పగింత కేసులో వాదనలు ప్రారంభం

లైంగిక అత్యాచారం కేసులో జులియన్ ను ఇంగ్లండ్ నుండి స్వీడన్ కు అప్పగించాలంటూ స్వీడన్ పోలీసులు బనాయించిన కేసులో వాదనలు సోమవారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యాయి. జులియన్ లాయర్లు రెండు ప్రధాన అంశాల మీద ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి సాంకేతిక కారణాలు కాగా రెండోది మానవ హక్కుల ఉల్లంఘన. స్వీడన్ పోలీసులు ఇంతవరకు జులియన్ పైన ఛార్జ్ ఏ నేరమూ మోపలేదు. లైంగిక అత్యాచారం ఆరోపణలపై అతనిని ప్రశ్నించటానికి మాత్రమే తమకు అప్పంగించాలని స్వీడన్ పోలీసులుకోరుతున్నారు.…