కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో
కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్, రామ నామ, అశుతోష్ మరో ఇద్దరు జేఎన్యూ విద్యార్ధులు ఫిబ్రవరి 9 తేదీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి, బిజేపి అధ్యక్షుడు, ఇతర కేంద్ర మంత్రులు, బిజేపి నేతలు, ఎంపిలు, ఎంఎల్ఏలు ఏకబిగిన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల్ని పురమాయించి దేశద్రోహం కేసు కూడా విద్యార్ధులపై బనాయించారు. కన్హైయాను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తుంటే హిందూత్వ లాయర్ గూండాలు ఆయన్ని కొట్టారు. కోర్టుకు వచ్చిన…

