అమెరికా, యూరప్ సంక్షోభాలకు పరిష్కారం చూపని జి7 సమావేశాలు
శుక్రవారం జరిగిన జి7 సమావేశాలు చప్పగా ముగిశాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్ధ మరొక మాంద్యం ముంగిట నిలబడి ఉన్నప్పటికీ ఇతమిద్ధమైన పరిష్కారారాన్నేదీ చూపలేకపోయింది. అందరం కలిసి ఉమ్మడి సహకారంతో సంక్షోభానికి స్పందించాలన్న మొక్కుబడి ప్రకటన తప్ప సమావేశాలు ఏమీ సాధించలేకపోయాయి. పైగా యూరప్ రుణ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి నిరాశపరిచాయి. యూరప్ రుణ సంక్షోభం పరిష్కారానికి యూరోప్ కి చెందిన శక్తివంతమైన దేశాలు యూరోజోన్ లోని బలహీన దేశాలకు ద్రవ్య మద్దతు ఇవ్వాలని అమెరికా నొక్కి చెప్పగా,…