చదువు కోసం అడుక్కున్న ఐశ్వర్య, సమాజం బతికేఉందని నిరూపించిన దాతలు

కడుపు చూపిస్తూ అడుక్కునే భిక్షకులు కోకొల్లలు. పిల్లల్ని భిక్షక వృత్తిలో దింపి లక్షలు, కోట్లు సంపాదించే మాఫియా ముఠాలకు కొదవలేదు. పదవులు, కాంట్రాక్టులు అడుక్కోవడం రాజకీయ నాయకులు, సూపర్ ధనికుల జన్మహక్కు. కానీ పొట్ట కోసం అడుక్కుంటున్న నాయనమ్మకి తెలియకుండా పక్కనే నిలబడి చదువుకోసం రహస్యంగా సహాయం కోరిన ఐదేళ్ల ఐశ్వర్య కధ ఎవరూ విని ఉండరు. మతి చలించి తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మ కోసమేనేమో తెలియదు గానీ డాక్టరీ చదువుకోవాలన్న బలమైన కోరిక ఐశ్వర్యను…