అమెరికాకు చట్టవిరుద్ధ రాయితీ ఇవ్వడానికి ప్రధాని రెడీ?
భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు…
