అమెరికా దాష్టీకం: వెనిజులా అధ్యక్ష విమానం సీజ్!

Venezuelan Aircraft Seized and Stationed in Florida అమెరికా బలహీన పడే కొద్దీ దాని చర్యలు పామరులకు కూడా అర్ధం అయేంతగా హద్దు మీరుతున్నాయి. అంతర్జాతీయ సూత్రాల ఆధారిత వ్యవస్థ (International Rules Based Order) అంటూ పదే పదే సొల్లు కబుర్లు చెబుతూనే ఏ సూత్రానికీ, నిబంధనకూ తన దుష్ట ప్రవర్తన కట్టుబడి ఉండదని చాటి చెబుతున్నది. తాజాగా వెనిజులా దేశాధ్యక్షుడి విమానాన్ని సీజ్ చేయటమే కాకుండా “ఆకుకు అందని పోకకు పొందని” కబుర్లతో…

ఈజిప్టు: ట్రోజాన్ హార్స్ (2)

యోం కిప్పుర్ వార్ 1973 అక్టోబర్ లో సిరియా, ఈజిప్టులు ఓ పక్కా, ఇజ్రాయెల్ మరో పక్కా  జరిగిన యుద్ధమే ‘యోం కిప్పుర్’ వార్. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ హైట్స్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం సిరియా లక్ష్యం. అలాగే ఇజ్రాయెల్ ఆక్రమించిన తన భూభాగం సినాయ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈజిప్టు లక్ష్యం. 1967 ఆరు రోజుల యుద్ధంలో ఓటమి ద్వారా కోల్పోయిన ప్రతిష్టను మరో యుద్ధంలో విజయం ద్వారా తిరిగి…

అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు

అమెరికాలో ప్రజాస్వామ్యం పని చేయడం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పష్టం చేసేశారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న గూఢచార విధానాలు పచ్చి అప్రజాస్వామికమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా అప్రజాస్వామిక గూఢచర్యం గురించి వెల్లడి చేయడం అమెరికాకు దీర్ఘకాలంలో లాభకరమని ఆయన వ్యాఖ్యానించారు.  జిమ్మీ కార్టర్ అమెరికాకు 1977 నుండి 1981 వరకు అధ్యక్షుడుగా పని చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవిని…

గ్వాంగ్జూ హత్యాకాండ నిర్మాతకు రాయబార హోదా, కొరియా చీకటిగాధ మరోసారి

దక్షిణ కొరియా ప్రజలు భయోత్పాతంతో గుర్తుకు తెచ్చుకునే గ్వాంగ్జూ సామూహిక హత్యాకాండ బాధ్యుడు ప్రభుత్వం ఇచ్చిన డిప్లొమేటిక్ ట్రావెల్ పాస్ పోర్ట్ తో దర్జాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రజాస్వామిక ఉద్యమకారులను చంపినందుకు కొరియా ప్రభుత్వం చేత మరణ శిక్ష కూడా విధించబడిన మాజీ కరకు నియంత ‘చున్ దూ-హ్వాన్’ ఇపుడు ప్రభుత్వ మర్యాదలు అనుభవిస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నియంతృత్వ పాలన అంతం కావడానికి కారణమయిన ప్రజాస్వామిక ఉద్యమాన్ని చున్ రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. అమెరికా రాయబారి ప్రత్యక్ష…