ఆటోవాలా చెంపదెబ్బ, కేజ్రీవాల్ గాంధీ దెబ్బ

ఢిల్లీలో ప్రచారం చేస్తుండగా మంగళవారం (ఏప్రిల్ 8) ఒక ఆటోవాలా చేతిలో చెంపదెబ్బ తిన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సదరు ఆటోవాలాకు తనదైన స్పందనను రుచి చూపించాడు. తన చెంప ఛెళ్ళుమానిపించిన ఆటో వాలా ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన ఎందుకు అలా చేయవలసి వచ్చింది కనుక్కునేందుకు ప్రయత్నించాడు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించనందునే తాను అలా చేయవలసి వచ్చిందని సదరు వ్యక్తి చెప్పడంతో ఆయనను క్షమించినట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పురి…