జింబాబ్వే సిరీస్: రసూల్ బెంచికే పరిమితం, కాశ్మీర్ గరం గరం
కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి…