ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 21 మంది దుర్మరణం, 141 మందికి గాయాలు -అప్ డేట్

ముంబైలోని జన సమ్మర్దమైన ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్ళలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 21 కి చేరుకోగా, 141 మంది గాయపడ్డారని తేలింది. పేలుళ్ళలో ఆత్మాహుతి బాంబుదాడిని కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. గం.6:54ని.లకు దక్షిణ ముంబైలోని జావేరి బజార్లో పేలిన మొదటి బాంబు శక్తివంతమైనదని తెలుస్తోంది. గం.6:55ని.లకు రెండవ బాంబు సెంట్రల్ ముంబైలో దాదర్ సబర్బన్ రైల్వే స్టేషన్ సమీపంలోని కబూతర్‌ఖానా బస్ స్టాప్ వద్ద పేలిందనీ, గం.7:05ని.లకు మూడవ బాంబు దక్షిణ ముంబైలోని ఒపేరా…